కార్మిక, వ్యతిరేక లేబర్ కొడ్స్ ని రద్దు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రంలో కేంద్రంలోని సుభాష్ చౌక్ లో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని కార్మికులు పోరాటం నిర్వహించి తెచ్చుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకాన్నికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. కార్మికులకి కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, అంగన్వాడి, ఆశ, మున్సిపల్, గ్రామపంచాయతీ,RP లు, ఉద్యోగ భద్రత కల్పించాలని స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వారి యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. అసంఘటితరంగా కార్మికులకు నేటికీ ఫుట్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఉందని హమాలీ, ఆటో కార్మికులకు బోర్డు ఏర్పాటు చేయకపోవడం సరైనది కాదని అన్నారు. వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక కూలీలకి కేరళ రాష్ట్రంలో రోజువారి కూలీ 800 రూపాయలు ఇస్తున్న దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయడంలో విఫలమైనాయి. వ్యవసాయ కూలీలకి కనీస వేతనాలు అమలు చేయాలని ఉపాధి కూలీలకి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు దేవమ్మ చెన్నమ్మ సువర్ణ గోవిందమ్మ అంగన్వాడి యూనియన్ నాయకులు రాజేశ్వరి నిర్మల అలివేల అల్లిరాణి CITU నాయకులు మన్యం మున్సిపల్ యూనియన్ నాయకులు రాజు గంగన్న రంజిత్ గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు హుస్సేన్ రాజేందర్ మంగమ్మ కాశన్న పాల్గొన్నారు. (Story:కార్మిక, వ్యతిరేక లేబర్ కొడ్స్ ని రద్దు చేయాలి)

