Homeవార్తలుతెలంగాణప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి

ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి

ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజా సమస్యలపై వినూత్నంగా పోరాడుతుందని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. పెద్దమందడి మండల కేంద్రంలో అఖిలపక్ష ఐక్యవేదిక మండల కమిటీ వేసిన తర్వాత పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా మండల కమిటీలు వేస్తూ పెద్దమండలి మండలంలో కృష్ణ యాదవ్ ను అధ్యక్షునిగా ప్రకటించి ఆయనతోపాటు ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవులను, ఉపాధ్యక్షులుగా శ్రీశైలంను నియమించామని, రాబోయే రోజుల్లో పెద్దమందడి మండలంలో ప్రజల తరఫున ఈ కమిటీ పోరాడుతుందని ప్రజా సమస్యలపై వినూత్నంగా పోరాడుతుందని తెలిపారు. ఈనెల 24న జరిగే మాజీ ఎమ్మెల్యే జయ రాములు వర్ధంతిని అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు విధిగా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా అన్ని మండల కమిటీలు జూన్ 1 లోగా పూర్తి చేసుకుంటామని తర్వాతనే ప్రజా సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు పెద్దమందడి మండల అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య, పుల్లయ్య, బొడ్డుపల్లి సతీష్, సంద రామస్వామి, కురుమూర్తి, శివకుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు . (Story:ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!