వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు
మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్నదొర
న్యూస్ తెలుగు/సాలూరు: అధికారులు సహకారంతో పండగ విజయవంతం అవ్వాలని వీరభద్ర స్వామిని కోరుకున్నానని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్నదొర అన్నారు ఆదివారం సాలూరు మెంటాడ వీధి లో ఉన్న వీర భద్ర ప్రభాను ఆదివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామలాంబ అమ్మవారి పండుగ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకుండా పండగా చక్కగా జరగాలని ఆ స్వామి వారిని కోరుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులు, ప్రజలు సహకారంతో పండుగ విజయవంతం అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గిరి రఘు సారిక బాలాజీ తదితరులు పాల్గొన్నారు.(Story : వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు )

