పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

న్యూస్ తెలుగు/సాలూరు : భక్తులకు శ్యామలాంబ అమ్మవారిని సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పి ఎస్.వి.మాధవ్ రెడ్డి, తెలిపారు. ఆదివారం సాలూరు పట్టణంలో సిరిమాను తిరిగే ముఖ్యమైన ప్రదేశాల్లోని అమ్మవారి ఆలయం వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భక్తులకు శ్యామలాంబ అమ్మవారిని సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
సుమారు 900 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రణాళికాబద్దమైన పటిష్ట బందోబస్తు
ఏర్పాటు చేశామన్నమని అన్నారు.సాంస్కృతిక కార్యక్రమాలు, వాహనాలు నిలుదల చేసే ప్రదేశాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు.
సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పురాతన భవంతులు, శిధిలావస్థలో ఉన్న భవంతులు గుర్తించి భద్రత ప్రమాణల దృష్ట్యా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సిరిమాను/ఘటాలు తిరిగే ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖతో , అదేవిధంగా భక్తులకు చేరువలో వైద్య సదుపాయం ఏర్పాట్లు ను ఆశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.శ్యామలాంబ అమ్మవారి పండగ పురస్కరించుకుని భక్తులకు సురక్షితమైన, సులభమైన అవాంఛనీయ జరగకుండాను, భక్తులు సులువుగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు., పండగను అమ్మవారిని సురక్షి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా, వాహనాల రెగ్యులేషను, ట్రాఫిక్, భక్తుల రద్దీని డ్రోన్స్ తో పర్యవేక్షిస్తామన్నారు. పండగ బందోబస్తును పాలకొండ డిఎస్పీ పర్యవేక్షిస్తారన్నారు. వాహనదారులకు, ప్రయాణికులకు
ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రద్దీ ని బట్టి డైవర్షన్ చేసే విధంగా ప్లాన్ అఫ్ యాక్షన్ రూపొదించు కొవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, జిల్లా ఎస్పీ అమ్మవారి ప్రధాన ఆలయం సందర్శించి, భక్తుల క్యూ లైన్స్, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల క్యూ లైన్స్ కోసం ఏర్పాటు చేస్తున్న బ్యారికేడ్లు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టారు. సిరిమాను తయారీ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖాధికారుల సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పురాతన భవంతులు, శిధిలావస్థలో ఉన్న భవంతులు గుర్తించి భద్రత ప్రమాణల దృష్ట్యా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు చేరువలో వైద్య సదుపాయం ఏర్పాట్లు ను ఆశాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్స్ దృడంగా ఉన్నాయా అని తనికీ చేసి స్టేజి ఏర్పాట్లను, ప్రజల రక్షణ కొరకు , అల్లర్లు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించినారు. వాహనాలు నిపుదల చేసే ప్రదేశాలు, సిసి కేమారాలు అనుసందానం చేసి పర్యవేక్షణ కొరకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు.
జిల్లా ఎస్పీ వెంట పాలకొండ డిఎస్పీ రాంబాబు, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, ఎస్బీ సిఐ రంగనాధం, సైబర్ సెల్ సిఐ శ్రీనివాస రావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
. (Story:పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ)

