Homeవార్తలుతెలంగాణకామ్రేడ్ ఈర్ల నరసింహ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఏఐవైఎఫ్

కామ్రేడ్ ఈర్ల నరసింహ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఏఐవైఎఫ్

కామ్రేడ్ ఈర్ల నరసింహ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఏఐవైఎఫ్

న్యూస్‌తెలుగు/వనపర్తి : సిపిఐ ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి, మాజీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈర్ల నరసింహ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా నిర్మాణ బాధ్యుడు రమేష్, జిల్లా కార్యదర్శి ఎండి కుతుబు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లో ఈర్ల నరసింహ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు సుదీర్ఘకాలం కార్యదర్శిగా ఉండి పేదల పక్షాన అనేక పోరాటాలు చేశారన్నారు. బిజినేపల్లి మండలం వెలుగొండ లో రైతు కూలీల సంఘాలు పెట్టి వారిని ఏకం చేసి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించారన్నారు. 20 ఏళ్లు సుదీర్ఘకాలం గ్రామ సర్పంచ్ గా, కొంతకాలం బిజినేపల్లి వైస్ ఎంపీపీగా పని చేశారన్నారు. ప్రజలను చైతన్యం చేసే నాటకాలు పాటలను రాసి ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. కష్టజీవుల పక్షాన ఆయన సాగించిన సమరశీల పోరాటం యువతరానికి స్ఫూర్తి కావాలన్నారు. ఆయన ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి కాగలదన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాద్రి, నాగర్ కర్నూల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పలువురు వై ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. (Story:కామ్రేడ్ ఈర్ల నరసింహ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఏఐవైఎఫ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!