‘కేసరి ఛాప్టర్ 2’ ట్రైలర్ రిలీజ్
ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి డబ్ చేయబడి మే 23న విడుదల కాబోతుంది. ఇప్పటికే హిందీ వర్షన్‌కు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.
తాజాగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ కుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.
అక్షయ్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. తన కెరీర్‌లోని అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఆర్. మాధవన్, అనన్య పాండే పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు సమగ్ర పరిశోధనతో పాటు భావోద్వేగంతో నిండిన కోర్ట్ సన్నివేశాలకు రియలిస్టిక్‌గా, ఆకట్టుకునేలా చూపించాడు. డబ్బింగ్ క్యాలిటీ అద్భుతంగా వుంది. తెలుగు ట్రైలర్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘కేసరి ఛాప్టర్ 2’ తో ప్రేక్షకులకు పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది. (Story: ‘కేసరి ఛాప్టర్ 2’ ట్రైలర్ రిలీజ్)