జెకె సిటీ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ
తెలుగు న్యూస్ /చింతూరు : జే కే సీటి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఎండి జమాల్ ఖాన్ బండారు గూడెం గ్రామానికి చెందిన సవలం శేఖర్, చట్టి గ్రామానికి చెందిన గంగానమ్మ గుంపు మోసం నారాయణ ఇంటి నిర్మాణానికి ఒక్క కుటుంబానికి 10 సిమెంట్ రేకులు 10 ఐరన్ పైపులను అందజేశారు. తుఫాను వరదల కారణంగా గత ఏడాది ఇల్లు పూర్తిగా శిథిలం కావడంతో నిలువ నీడ లేకుండా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జే కే సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. దానికి జమాల్ ఖాన్ సానుకూలంగా స్పందిస్తూ శనివారం రెండు కుటుంబాల వారికి ఇంటి నిర్మాణ సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెకె సి టి సభ్యులు సమీర్, అబ్దుల్ వహీద్, మాజీ సర్పంచ్ సోడి శ్రీనివాసరావు, ఎండి జహంగీర్, మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు, తు ర్రం చిన ముత్తయ్య, అనిగి చంద్రయ్య, పాల్గొన్నారు. (Story:జెకె సిటీ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ)