‘భైరవం’ మంచి యాక్షన్ థ్రిల్లర్
గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం? ఒరిజినల్ కథకి తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేశారు?
– కథ కమర్షియల్ గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్ లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో వుంటుంది. క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ నా స్టైల్ లో ఉంటుంది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఒరిజినల్ చూసిన వరకు కూడా డెఫినెట్ గా కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. ఒరిజినల్ కంటే ఇది బావుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు ఈ ముగ్గురితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు సాయి గారిని ఫైనల్ చేసుకున్నాం. తర్వాత రోహిత్ గారిని మనోజ్ గారిని కలిసాం. ఇద్దరు ఓకే చెప్పారు. మనోజ్ గారు రోహిత్ గారు చాలా మంచి పర్ఫార్మర్స్. అలాగే వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఒక మంచి యాక్టర్స్ నుంచి మంచి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆడియన్స్ ధియేటర్ కి వస్తారని నమ్మకం ఉంది.
-ఒరిజినల్ లో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే తెలుగు ఆడియన్స్ కి కావలసిన ఎమోషన్స్ వుంటాయి.
ముగ్గురు హీరోలతో సెట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలెంజింగ్ మూమెంట్ ఏమిటి?
-బిగినింగ్ లో ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమవుతుందేమో అనుకున్నాను. అయితే ఈ ముగ్గురు కూడా ఆఫ్ స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. 14 రోజులు పాటు ఫుల్ నైట్స్ వర్క్ చేసాం. దాదాపు 900 మంది సెట్స్ లో ఉండేవారు. అ అపోర్షన్ షూట్ చేయడం చాలెంజింగ్ గా అనిపించింది.
అతిధి శంకర్ గురించి?
-తను కార్తీతో చేసిన సినిమా చూశాను. పెర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా సాయి శ్రీనివాస్ తో తనకి చాలా మంచి కెమిస్ట్రీ ఉంటుంది. తన క్యారెక్టర్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. పర్ఫెక్ట్ గా చేసింది.
-నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం జాయ్ ఫుల్ గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్య జరుగుతున్న డ్రామా. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలో అంతే పెట్టాం. ముగ్గురి క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి. మనోజ్ గారు సెట్స్ లో వుంటే చాలా జాయ్ ఫుల్ గా ఉంటుంది.
శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి?
-శ్రీ చరణ్ తో నాకు ఇది రెండో సినిమా. తన పర్ఫెక్ట్ గా మ్యూజిక్ చేశాడు. చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మూడు పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. మరో సాంగ్ 21న రిలీజ్ చేస్తున్నాం. చాలా కమర్షియల్ గా ఉంటది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేసాడు. రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్తగా ట్రై చేసాడు.
మీకు చాలెంజింగ్ అనిపించే జానెర్ ఏది?
-డ్రామా, యాక్షన్ థ్రిల్లర్స్ హారర్.. ఇవన్నీ ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ మాత్రం చాలా కష్టం.
ఈ సినిమాకి భైరవ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
-కథ నుంచి వచ్చిన టైటిల్ ఇది. సినిమాలో చిన్న డివోషనల్ టచింగ్ ఉంటుంది. ఒక గ్రామంలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి భైరవం అని టైటిల్ పెట్టాం.
ఇందులో కనిపించిన టెంపుల్ రియల్ లోకేషనా?
-ముందుగా మేము మైసూర్ లో రియల్ లొకేషన్ లో సూట్ చేయాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేయడం వల్ల అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ వేసి సూట్ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది.
నెక్స్ట్ సినిమా ఏంటి?
-కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏమీ అనుకోలేదు, భైరవం ఇచ్చే సక్సెస్ బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది.
ఎలాంటి కథలు సిద్ధం చేసుకున్నారు?
-చిరంజీవి గారి కోసం ఒక కథని సిద్ధం చేసుకున్నా. అలాగే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి కోసం కూడా ఒక కథను సిద్ధం చేశాం. చిరంజీవి గారిని ఈ సినిమా గ్యాప్ లో ఒకసారి కలవడం జరిగింది. ఆయన టైం ఇస్తామని చెప్పారు.
ఆల్ దిబెస్ట్
-థాంక్యూ (Story:’భైరవం’ మంచి యాక్షన్ థ్రిల్లర్)