పురపాలక సంఘం ఆధ్వర్యంలో “బీట్ ద హీట్” కార్యక్రమం పై అవగాహన
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు ప్రతినెల 03 వ శనివారం నాడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మే నెల మూడవ శనివారం “బీట్ ద హీట్” అనే అంశం పేరుతో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వడదెబ్బ నుండి మరియు వేడి గాలుల నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మున్సిపల్ కార్యాలయం వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు గురించి వివరించారు. ఇందులో భాగంగా చలివేంద్రాల ఏర్పాటు, ముఖ్య కూడళ్లలో ప్రజలు విశ్రాంతి తీసుకొనుటకు తాత్కాలికంగా చలువ పందిరి ఏర్పాటు, పశువులకు ఇతర సాధు జంతువులకు అక్కడక్కడ మంచినీటి సౌకర్యార్థం నీటి తొట్టెలు ఏర్పాటు చేయుట, మరియు వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వేడి గాలుల నుండి వడదెబ్బ నుండి వారిని రక్షించుకొనుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.కె. ఇస్మాయిల్, వార్డు కౌన్సిలర్స్, ఎన్జీవోలు, మెప్మా సిబ్బంది, వార్డు సెక్రటరీలు, శానిటేషన్ మేస్త్రీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.(Story:పురపాలక సంఘం ఆధ్వర్యంలో “బీట్ ద హీట్” కార్యక్రమం పై అవగాహన)

