Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్యామలాంబ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ర‌గ‌డ‌

శ్యామలాంబ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ర‌గ‌డ‌

శ్యామలాంబ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ర‌గ‌డ‌

న్యూస్ తెలుగు/సాలూరు: శ్యామలాంబ అమ్మవారి పండుగకు సంబంధించిన పనులు అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 15వ తారీఖున ప్రెస్‌మీట్‌లో  అనడం తీవ్రంగా ఖండిస్తున్నామని సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అన్నారు. శుక్రవారం అనగా 16 వ తారీఖున‌ ఆమె కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పండుగకు సంబంధించి పనులకు సంతకాలు పెట్టలేదని పనులు ఆమోదించలేదని ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మీరు మంత్రి అయినప్పటి నుంచి ఎంతో గౌరవంగా మిమ్మల్ని చూసామని ఈరోజు మా పాలకపక్షం పై ఇలాంటి మాట్లాడడం చాలా బాధనిపిస్తుంది అని అన్నారు. అమ్మవారి పండుగ బాగా జరగాలని అన్ని పనులకు ఆమోదం తెలిపామని ఆన్నారు. తప్పు ఎవరు చేస్తే వారిని ఆ శ్యామలాంబ తల్లి శిక్షిస్తారని అన్నారు. పెద్ద వయసురాలు మున్సిపల్ ప్రధమ పౌరురాలైన నన్ను ఒక మహిళ అని చూడకుండా నాపై దౌర్జన్యం చేయడంతో పాటు దూర్భాషలాడడం అవమానపరచడమే పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి)కిమీరు నేర్పించిన సంస్కారమా అని మంత్రి ని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి రెండు కోట్లు అప్పుగా మంజూర అయిందని ఆ డబ్బు జనరల్ ఫండ్ నుండి సాలూరు మున్సిపాలిటీ,ప్రజలు అప్పు తీర్చాలని అన్నారు. పండగ ప్రకటించి దాదాపు పది నెలలు కావస్తుందని, నాలుగైదు నెలలు ముందు ప్రణాళికల సిద్ధం చేసి నిధులు మంజూరు చేసినట్లయితే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. తప్పు మాది కాదు మున్సిపాలిటీ పాలక వర్గం వారిదే తప్పు ఆని దురుద్దేశంతో మాట్లాడడం, ఇవన్నీ ఆ శ్యామలాంబ తల్లికి ప్రజలకు తెలుసునని అన్నారు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం చీపుళ్ళు, బ్లీచింగ్ పౌడర్ మరియు ఇతర సామాగ్రి కి 18 లక్షల రూపాయలు టెండర్లు పిలవకుండా వానపల్లి శంకర్రావు పేరుమీద అజెండలో ఆమోదించలేదని, అదేవిధంగా అవసరం లేని చోట పైలెట్ వాటర్ స్కీములు ఎందుకు మంజూరు చేస్తున్నారని కౌన్సిల్స్ అడిగామనే ఉద్దేశంతోనే ఆ కోపంతో మాపై విమర్శలు చేస్తున్నారని ఎవరి మనసు ఏమిటో, మాటేమిటో, తప్పె ఎవరిదో ఓప్పు ఎవరిదో అంత ఆ శ్యామలాంబ తల్లికి తెలుసునని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేసేటప్పుడు ఫోటో కాల్ పాటించరా అని అన్నారు. శoబర పండగకు, పాడేరు మోదుకొండమ్మఅమ్మవారి పండగకు అప్పటి మంత్రి రాజన్నదొర రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు మంజూరు చేశారని మరి సాలూరు అమ్మవారి పండుగకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా నిధులు తీసుకొచ్చారా దీని గురించి ఒకసారి ఆలోచించండి అని అన్నారు. ఇక పండగ ఆలస్యం అవ్వడానికి ముఖ్య కారణం రెండు సంవత్సరాలు కరోనా, ఆ తర్వాత సంవత్సరం యువరాజు వాళ్ళ అల్లుడు మరణించడం, మరచిటి సంవత్సరం జన్నివారి ఇంటిలో మహిళా చనిపోవడం ఇలా ఆలస్యం జరిగిందే తప్ప శ్యామలాంబ పండుకి మేము వ్యతిరేకం కాదని అమ్మవారి పండుగ విజయవంతంగా నిర్వహించుటకు మున్సిపాలిటీ చైర్పర్సన్ మా కౌన్సిలర్లు, వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ పండుగ విజయవంతం అవ్వాలని ఆ శ్యామలంబ అమ్మ వారిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గొర్లె జగన్మోహన్ రావు, ముసిడిపల్లి సరోజినీ, సింగరపు ఈశ్వరరావు, గిరి రఘు తదితరులు పాల్గొన్నారు. (Story:శ్యామలాంబ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ర‌గ‌డ‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!