Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కబడ్డీ క్రీడాకారులకు సమ దుస్తులు పంపిణీ..

కబడ్డీ క్రీడాకారులకు సమ దుస్తులు పంపిణీ..

కబడ్డీ క్రీడాకారులకు సమ దుస్తులు పంపిణీ..

న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ(శాప్) వారి ఆధ్వర్యంలో ఈనెల 1 నుండి 31 వరకు జరిగే కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డు లోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతుందని కబడ్డీ కోచ్ కోమటి గుంట శ్రీహరి తెలియజేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కబడ్డీ క్రీడాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కె శ్రీహరి తెలియజేశారు. ఈ కబడ్డీ క్యాంప్ నిర్వహించుకునేందుకు తనకు సహకరించిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 13 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ క్యాంపు కార్యక్రమానికి డిసి చైర్మన్ గంగినేని రాఘవరావు , పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్, ఈపూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమనేని అశోక్ కుమార్ సందర్శించి క్రీడాకారులకు సమదుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగినేని రాఘవ మాట్లాడుతూ. ఈ కబడ్డీ క్యాంపు ద్వారా క్రీడాకారులు కబడ్డీ ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకునే మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు గతంలో ఉన్న 02% ఉద్యోగ అవకాశాన్ని 03% కు పెంచటం జరిగిందన్నారు. (Story:కబడ్డీ క్రీడాకారులకు సమ దుస్తులు పంపిణీ..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!