న్యాయవాది మక్కెన పేరయ్య 4 వ వర్ధంతి
న్యూస్ తెలుగు /వినుకొండ : సీనియర్ న్యాయవాది కీర్తిశేషులు మక్కెన పేరయ్య 4 వ వర్ధంతినీ న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కెన పేరయ్య ని స్మరించుకుంటూ, అందరివాడుగా గుర్తింపు పొందారని, అందర్నీ ఆప్యాయంగా పలకరించే వారిని పలువురు సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, సెక్రటరీ పి గౌస్ మొహిద్దిన్ ఖాన్, జాయింట్ సెక్రెటరీ ఎన్ శేఖర్ బాబు, ట్రెజరర్ వి శివ శంకర్ బాబు, సీనియర్ న్యాయవాదులు పి.జె.లూకా, ఎన్ రామ కోటేశ్వరరావు , పి సైదారావు, టి హనుమంతరావు, వై శ్రీనివాసరావు, ఏజీపీ ఎం జ్ఞానేశ్వర్ రావు, కే చెన్నకేశవరెడ్డి,జె తిరుపతిరావు, బి శ్రీనివాసులు, ఎం ఎలిషా బాబు,ఎన్ రమణారావు, ఏం సీతారామాంజనేయులు, ఆర్ బాబు, డి విజయ్,డి నాగరాజు , ఎం చంటి, ఎంపీ అప్పారావు,తదితర సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు గుమస్తాలు పాల్గొన్నారు.(Story : న్యాయవాది మక్కెన పేరయ్య 4 వ వర్ధంతి )