Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఐ సి డి ఎస్. ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ఏవేర్నెస్ క్యాంప్స్

ఐ సి డి ఎస్. ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ఏవేర్నెస్ క్యాంప్స్

0

ఐ సి డి ఎస్. ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ఏవేర్నెస్ క్యాంప్స్

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ ఐ సి డి ఎస్. ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం. అనురాధ ఆధ్వర్యంలో మే 25 నుండి జూన్ 10వ తారీఖు వరకు సమ్మర్ స్పెషల్ ఏవేర్నెస్ క్యాంప్స్ కిశోర వికాసం జరుగుతాయని అని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. బాలికలు ఒకరినొకరు పరిచయం చేసుకొని లక్ష్యాలను నిర్ధారించుకోవడం శుక్రవారం వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి అంగన్వాడి కేంద్రం నందు కిషోర్ వికాసం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం 11 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు ఆరోగ్యం సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ఏసవి సెలవుల్లో భాగంగా భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కిషోరి వికాసం పేరిట అవగాహన శిబిరాలను ప్రారంభించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి గ్రామాల వారిగా కమిటీ తర్వాత నియమించి ఎమ్మెస్ కే మరియు ఏ డబ్ల్యు టి లు కి బాధ్యతలు అప్పగించినామని వీరికి డిఆర్డిఏ మరియు మెప్మా ఏఎన్ఎం భాషలతో బాలికల భవితకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగ పడుతుందని ఐసిడిఎస్, సిడిపిఓ, మేడం ఎం. అనురాధ, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.నాగరాజు, కుమారి మాట్లాడుతూ. విజ్ఞానం మరియు వివేకం తో కూడిన కార్యక్రమాలు విద్యా క్రీడలు చట్టాలపై అవగాహన ఆడపిల్లలకి అవసరమైన యోగ వ్యాయామం బాల్యవివాహాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనికి పంచాయతీ కార్యదర్శులు ఇలాంటి కార్యక్రమాల వలన కిషోర్ బాలికలు చైతన్యవంతులు అవతారని వారి ఆరోగ్యం వారి కుటుంబం ఆరోగ్యం పై అవగాహన పెరిగి జాగ్రత్తగా ఉంటారని దీనివలన వారి భవిష్యత్తు జీవితంలో ఆత్మ ధైర్యంతో ముందడుగు వేయటానికి ఈ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి అని బాల్యవివాహాలు జరగకుండా విద్య పరంగా ఎదగటానికి దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె బేగం అంగనవాడి కార్యకర్తలు ఎం అనురాధ సిడిపిఓ, తదితరులు పాల్గొన్నారు. (Story:ఐ సి డి ఎస్. ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ఏవేర్నెస్ క్యాంప్స్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version