ఎర్రజెండా రెపరెపలతో ఎరుపెక్కిన వినుకొండ
న్యూస్ తెలుగు / వినుకొండ : ఎ ఐ టి యు సి వినుకొండ ఏరియా అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మేడే పతాక ఆవిష్కరణలు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని కార్మిక వాడ వాడలలో పరిశ్రమల కేంద్రాలలో ఘనంగా ఆవిష్కరించారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ అన్నారు. “మే డే” ను పురస్కరించుకొని ముందుగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వందలాది మంది పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే పతాకావిష్కరణను భవన నిర్మాణ కార్మిక సీనియర్ నాయకులు మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా ఆవిష్కరించారు. నిర్వహించిన సభలో జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోజుకు 18 గంటలు పనిచేయుచు బానిస బ్రతుకులు వెళ్లదీస్తు రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవుల శ్రమ దోపిడీని నిలువరించాలని ఎనిమిది గంటల పని దినాల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న సమయం 1886 లో చికాగో నగరంలోని హే మార్కెట్ సెంటర్లో సభ నిర్వహించుకుంటున్న కార్మికులపై పోలీసు తూటాలు ఒక్కసారిగా పేలిన నేపథ్యంలో ఏడుగురు కార్మికుల ప్రాణాలు బలైపోయాయని ఆ కార్మికుల రక్తం నుండి తడిసిన జెండాను కార్మికుల జెండాగా ఆవిష్కరించుకొనుచు ఆనాటి నుండి మేడే నాడు అశువులు బాసిన కార్మికులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాడి విజయాలు సాధించిన విజయోత్సవ దినంగా కార్మిక వర్గం యావత్తు మేడేను జరుపుకుంటారని ఆయన అన్నారు. మనదేశంలో ఎఐటియుసి 1920లో స్థాపించబడి భారతదేశ కార్మిక వర్గానికి దిక్సూచిగా ఎనిమిది గంటల పని దినాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల కార్మికులకు వర్తింపజేసి అనేక కార్మిక చట్టాలను పోరాడి సాధించి పెట్టిన ఘనత ఏఐటియుసి ది అన్నారు. ఇంకా పట్టణంలోని ఆటో కార్మికులు, ముఠా కార్మికులు, మున్సిపల్ కార్మికుల, ఇంజనీరింగ్ వర్కర్స్, ఎలక్ట్రికల్ కార్మికులు, ఆర్టీసీ కార్మికుల, రైల్వే స్టేషన్ సెంటర్ ఆటో కార్మికులు, ఎన్ఎస్పి వర్కర్స, ఆటో ఆర్టీసీ సెంటర్ కార్మికుల, పార్వతీపురం వ్యవసాయ కార్మికులు, ముఠా వర్కర్స్ యూనియన్, తాపీ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు, పట్టణంలో వార్డులలో ని హమాలీ కార్మికులు, కందిపప్పు మిల్లు కార్మికులు, ఆయిల్ మిల్లు కార్మికులు, వారి వారి ప్రాంతాలలో మొత్తం వంద జెండాలు పైబడి ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, ఏఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఎఐటియుసి నాయకులు
రాయబారం వందనం, బూదాల చిన్న, పిన్నబోయిన వెంకటేశ్వర్లు,ఎ. పవన్ కుమార్, కొండ్రముట్ల చిన్న సుభాని, షేక్ కిషోర్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రేవల్ల శ్రీనివాసరావు, షేక్ నాగూర్, పారిశుద్ధ్య కార్మిక నాయకులు సంపెంగుల అబ్రహం రాజు, శామంత పూడి సాయిబాబు, పచ్చి గొర్ల ఏసు, పొట్లూరి వెంకటేశ్వర్లు, సోడాల సాంబయ్య, కొండమ్మ, మార్తమ్మ, మరియమ్మ, కోటేశ్వరమ్మ, దేవమ్మ, రైల్వే ఆటో కార్మిక నాయకులు ఫ్రాన్సిస్ రైల్వే అధికారులు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి. సాంబశివరావు, విన్సెంట్, షేక్ కాజా, హరిబాబు, వడలి కామేశ్వరరావు, కొప్పరపు మల్లికార్జునరావు, కారుమంచి మీరావలి, తదితరులు జండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనగా ప్రపంచ కార్మికులారా ఏకం కండని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, కార్మికుల హక్కులను కాపాడుకొనుటకు అందరం ఐక్య ఉద్యమాలు నిర్మించాలని అనే నినాదాలతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆటో కార్మికుల మరియు పారిశుద్ధ్య కార్మికుల ర్యాలీలు పట్టణంలో ఘనంగా జరిగాయి.(Story:ఎర్రజెండా రెపరెపలతో ఎరుపెక్కిన వినుకొండ)
