క్రీడా స్ఫూర్తితో ఆడాలి కీర్తి ప్రతిష్టలు సాధించాలి
జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలని దానితోనే కీర్తి ప్రతిష్టలు పొందవచ్చన్నారు. గురువారం మండలంలోని కొమ్మూరు గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ను జమాల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి దోహదపడతాయని దురలవాట్లకు దూరంగా ఉంచుతాయని శారీరకదారుద్యం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయన్నారు. నేటి యువతే దేశానికి యువ శక్తిగా మారాలని రాబోయే తరాలకు మార్గదర్శకత్వం కావాలని అన్నారు. నేటి కాలంలో యువత విలువైన కాలాన్ని సెల్ఫోన్ల క్రీడల్లో బెట్టింగులు వంటి ప్రమాదకరమైన సెల్ ఫోన్ క్రీడలకు లోను అవుతున్నారని అటువంటి వాటిని దరి చేరనియకుండా అందరూ జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వేల రూపాయల నగదును అందజేశారు. మొదటి ప్రైజ్ మనీ 70 వేల రూపాయలు రెండవ ప్రైజ్ మనీ 40,000 గా ప్రకటించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 64 టీంలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ గ్రామ పెద్దల కమిటీ సభ్యులు బాబు, నారాయణ మాస్టర్. రాము, దినేష్, హరి, జంపు, శివ జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు రియాజ్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. (sTORY:క్రీడా స్ఫూర్తితో ఆడాలి కీర్తి ప్రతిష్టలు సాధించాలి)

