ఆర్టీసీ ఇ యు కార్యాలయంలో మేడే వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : మేడే సందర్భంగా ఆర్టీసీ డిపో వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ జెండా ఎగరవేసి కార్మికులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ. మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. పోరాటాల ద్వారా మనం ఎనిమిది గంటల పని విధానాన్ని అమల చేయించమని, ఈ ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో నగరంలో కార్మికులు, పోలీసుల తంటాలకు బలైనారని పేర్కొంటూ, వారి పోరాటాలను మనం విస్మరించకుండా, వారి ఆశయ సాధనలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటానని, మీ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా రండి అని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కి గాని, కార్మికులకు గాని చేసింది ఏమీ లేదని, మిమ్మల్ని ప్రభుత్వంలో విలనం చేసి మీకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదని, ఆర్టీసీ భూములను ఆక్రమించుకోవడానికి పెద్ద కుట్రలు జరిగాయని, గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు కురిపించారు. గుంటూరు జిల్లా డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. తన చిన్నతనం నుండి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యమాలను చూస్తున్నానని, అనేకసార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నానని పోరాట పటిమగల నాయకులు ఎంప్లాయిస్ యూనియన్ లో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షకీలా, న్యాయవాది సైదారావు, జనసేన నాగ శీను, ఆర్టీసీ కార్మికుల నాయకులు సాంబశివరావు, ఖాజా, హరిబాబు, గుమ్మడి, సిపిఐ నాయకులు రాయబారం వందనం, సుభాని మేస్త్రి, గణపవరం శ్రీను, సిఎస్ఎస్ డెలిగేట్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. (Story:ఆర్టీసీ ఇ యు కార్యాలయంలో మేడే వేడుకలు)

