ఇది అత్యవసర సమావేశమేనా..
అజెండాలోని ఒక్క అంశం మినహా, మిగతా అంశాలన్నీ వాయిదా వేసి సమావేశం నుండి వెళ్లిపోయిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఇది మున్సిపల్ అత్యవసర సమావేశమా, ఆలస్య సమావేశమా, సమయం దాటినా మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్ హాజరు కాలేదు. 32 మంది కౌన్సిలర్లకు కేవలం పది మంది మాత్రమే వచ్చారు. మనం ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలచే ఓట్లు వేయించుకుంది, ఇలా అయితే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తాం, అంటూ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా అత్యవసర సమావేశం ఎజెండాలో పొందుపరచిన 39 అంశాలు ఎజెండా రూపొందించేటప్పుడు తమకు ఎందుకు తెలపలేదని, నెలాఖరులో సాధారణ సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఈ అత్యవసర సమావేశం ఏంటి అని చైర్మన్ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎజెండా అంశాలు చూసి నేను ఎలా సంతకం పెడతాను. చైర్మన్ అంటే లెక్క లేదా అని అజెండాలోని ఒక్క అంశం మాత్రమే ఆమోదించి మిగతా 38 అంశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చైర్మన్ డాక్టర్ దస్తగిరి సమావేశం నుండి సీరియస్ గా వెళ్లిపోవడంతో కౌన్సిలర్లు, అధికారులు ఖంగుదిని సమావేశం ముగించి వెళ్ళిపోయారు. అయితే సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న కారణంగా తన చాంబర్లో ఉన్నానని అందువల్ల 20 నిమిషాలు లేటుగా వచ్చానని చైర్మన్ కు వివరించారు. అలాగే నెలాఖరులోసాధారణ సమావేశం జరపాల్సి ఉన్నప్పటికీ. గత సమావేశంలో పెద్ద మొత్తంలో 62 అంశాలు అజెండాలో రూపొందించి ఆమోదించడం జరిగిందని. అప్పుడు 10 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు కూడా ఆమోదించి మే నెలలో పనులు ప్రారంభించడం జరుగుతుందని. అందువల్ల ప్రధాన అంశాలు మాత్రమే అజెండాలో రూపొందించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని. అయితే సమాచారం చైర్మన్ కు పంపడం జరిగిందని ఏదో లోపం జరిగిందని చైర్మన్కు వివరించారు. ఇక మీద ఇలా జరగకుండా చూస్తామని కమిషనర్ తెలిపారు.. ఇటీవల వైసిపి నుండి తమ అనుచరులతో కలిసి టిడిపిలో చేరిన చైర్మన్ దస్తగిరి. సమావేశం నుండి ఆగ్రహంతో వెళ్లిపోవడం చూస్తుంటే. తాను అధికార పార్టీ టిడిపిలో చేరినప్పటికీ, నేనంటే లెక్క లేదా అన్న భావన ఆయనలో స్పష్టంగా కనిపించినట్లు ఉందని పలువురు గుసగుసలాడారు. (Story:ఇది అత్యవసర సమావేశమేనా..)

