ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఈ ప్రభుత్వ హయాములో రైతుల దీనస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ,సాగునీళ్ళు సరిగా రాకున్నా కష్టపడి పండించుకున్న ధాన్యం సకాలములో కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ తదితర కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యాసంగి పంటలో ఎటువంటి తేమగాని,తరుగుకాని ఉండదు కానీ అధికారులు తేమ ఉందని కొన్నిరోజులు,తాళ్ళు ఉందని కొన్నిరోజులు, గన్ని బ్యాగులు లేవని కొన్నిరోజులు,లారీలు రాలేదని కొన్ని రోజులు రైతులను నానా ఇబ్బందిపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా రైతులు తరుగు కోల్పోవడం తో పాటు తేమ,తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదురుకుంటున్నారని అన్నారు. రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని బ్యాగులు నింపి ట్రాన్స్పోర్ట్ వరకు ఆగాలివస్తుందని వారికి సరిఅయిన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని ఇప్పటికైనా మంత్రులు,అధికారులు వెంటనే స్పందించి సకాలములో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచిన కె.సి.ఆర్ గారిని వదులుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హరిగోసా పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఇమ్రాన్,నారాయణ నాయక్, మాజీద్,శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు. (Story:ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం)

