చికాగో కార్మిక అమరుల స్ఫూర్తితో హక్కులకై పోరాటం : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి :అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం పోరాటంలో అమరులైన కార్మికుల స్ఫూర్తితో కేంద్రం హరించివేస్తున్న కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం కటికనేని గోపాల్ రావు భవన్ వనపర్తి సిపిఐ కార్యాలయంలో జె చంద్రయ్య అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య నేతలతో మేడే సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మే 1వ తేదీన ప్రతి గ్రామం పట్టణం కార్మిక వాడ, సిపిఐ శాఖలో ఉన్న ప్రతి గ్రామంలో ఎర్రజెండాలను ఎగరవేయాలి అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను హక్కులను హరించి వేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలకు వివరించాలన్నారు. దశాబ్దాలుగా పోరాడి కార్మికులు ఎనిమిది గంటల పని దినం సాధించుకోగా, పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకు 12 గంటల పని దినం చేశారన్నారు. కార్మికులు సమ్మె హక్కు, సంఘంపెట్టుకునే హక్కు లేకుండా చేశారన్నారు. గత ఏడాది ఉపాధి హామీ కూలీలకు 8 కోట్ల పని దినాలు కల్పించగా ఏడాది ఆరున్నర కోట్లకు తగ్గించారన్నారు. ఉపాధి కూలీలకు రూ. 26 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉపాధి కూలీల రోజు కూలి రూ. 307 నుంచి 700 లకు పెంచాలన్నారు. కార్మికులకుసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం సిపిఐ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకొని పోరాడాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, వివిధ మండల నాయకులు ఎర్ర కుర్మయ్య,శాంతమూర్తి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. (Story:చికాగో కార్మిక అమరుల స్ఫూర్తితో హక్కులకై పోరాటం : సిపిఐ)