ఆయుష్మాన్ ఆరోగ్య ఉద్యోగులు ఒంటి కాళ్ళ మీద నిరసన
న్యూస్‌తెలుగు/విజయనగరం: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల డివిజన్ కు సంబంధించిన ఉద్యోగులు ఒంటి కాళ్ళ మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా పి తేజస్వి, హిమబిందు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాల పూర్తి చేసుకున్న సి హెచ్ ఓ లను రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని పని ఆధారిత ప్రోత్సాహ కాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ఓ పునర్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ పితృత్వ సెలవులను అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కరుణ్, అలేఖ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. (Story:ఆయుష్మాన్ ఆరోగ్య ఉద్యోగులు ఒంటి కాళ్ళ మీద నిరసన)