Home వార్తలు ‘హిట్ 3’ సూపర్ డూపర్ హిట్ అవుతుంది

‘హిట్ 3’ సూపర్ డూపర్ హిట్ అవుతుంది

0

‘హిట్ 3’ సూపర్ డూపర్ హిట్ అవుతుంది

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్  ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాని చాలా బాగా మాట్లాడి చాలా ఎమోషనల్ చేసేసాడు. థాంక్యూ నాని. ఇండస్ట్రీలో మేమంతా ప్రశాంతిని హిట్ మిషన్ అని పిలుస్తుంటాము. తను 100% సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్. ఐదో సినిమాగా వస్తున్న హిట్ 3 మే 1 నా కంటిన్యూస్ అదే సక్సెస్ ట్రాక్ లోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న హిట్ త్రీ ఇంటర్వ్యూ చూస్తున్నాను. సినిమాకి సంబంధించి ఏదైనా విషయం బయటికి లీక్ అయినప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ శైలేస్ చాలా కూల్ గా సెటిల్ గా మాట్లాడిన విధానం నాకు చాలా ఆకట్టుకుంది. తనపై గౌరవం ఏర్పడింది. చాలామంది ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు. కానీ అవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. కానీ శైలేష్ హిట్ ఫస్ట్ కేసు అని క్రియేట్ చేసిన వెంటనే తర్వాత సెకండ్ కేస్ థర్డ్ కేస్ అనంతంగా ఉంటాయి కదా ఆటోమేటిక్గా థాట్ వస్తుంది. తనకున్న ఆలోచనలు ఏడే కావచ్చు. కానీ హిట్ ఫ్రాంచేజీ అంతకంటే ఎక్కువగా కొనసాగుతుందని నమ్ముతున్నాను. నాని ఏ సినిమా చేసిన హిట్ అని తెలుస్తుంది. తన్నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాని నేను ఎక్స్పెక్ట్ చేసిందని కంటే చాలా ముందుకు వెళ్లిపోయాడు. అయితే ఆశ తీరదు. నాని ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వైబ్ ని క్రియేట్ చేస్తున్నాయి. మే1 ఓన్లీ ఇన్ థియేటర్స్. ఆప్ కీ బార్ అర్జున్ సర్కార్. థాంక్యూ వెరీ మచ్’అన్నారు.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి ఎనర్జీ మాకు చాలా జోష్ ని ఇచ్చింది. రాజమౌళి గారితో నాకు ఒక సెంటిమెంట్ ఉండేది. మేము ప్రతి కొత్త సినిమాని ప్రసాద్ ఐమాక్స్ లో చూసేవాళ్ళం. సినిమా రిజల్ట్, సినిమా ఎలా ఉందని ఆయన అడిగే తెలుసుకునేవాడిని, కానీ ఇప్పుడు అటువైపు వెళ్ళటం లేదు. మే1న ఆయనకి ఏ పనులు ఉన్నా సరే.. ఒకవేళ ఆయనకి ట్రావెల్ ఉంటే ఆయన పాస్ పోర్ట్ నేను లాగేసుకుంటా (నవ్వుతూ) మీరు సినిమా చూసి మళ్లీ ఆ ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాని ఆయన ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది. రాజమౌళి గారికి నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయినట్టుగా చేసిన ఆయన ఫ్యామిలీ అందరికీ థాంక్యు. సినిమా డిక్షనరీ లోకి వెళ్లిపోయిన ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. సినిమాల్లో ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి గారి సీన్ లా ఉండాలి అని మాట్లాడుకుంటాం. అలాంటి ఒక సీక్వెన్స్ హిట్ 3 లో వుంది. విశ్వక్సేస్మ శేష్ హిట్ వెర్స్ కి పిల్లర్స్. వాళ్లు బిల్డ్ చేసినది నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నాం. ఈ ఫంక్షన్ కి వాళ్ళు కూడా రావడం ఒక ఫ్యామిలీ ఫంక్షన్  అన్న ఫీలింగ్ ఇచ్చింది.శైలేష్ స్ట్రెంత్ నాకు తెలుసు. తనలో ఉన్న స్ట్రెంత్ ని తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు. తన స్ట్రెంత్ తాలూక ట్రైలర్ ని మే1న చూడబోతున్నారు. సానుగారు నా ఫేవరెట్ డిఓపి. క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ స్పెషల్ థాంక్స్.మిక్కీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు . శ్రీనిధి మృదుల క్యారెక్టర్ ని అద్భుతంగా చేసింది. ప్రమోషన్స్ ని కూడా తన సొంత సినిమా లాగా చేసింది . మిగతా టీంలో ఇప్పుడే థాంక్స్ చెప్పలేని పేర్లు కొన్ని ఉన్నాయి. రిలీజ్ తర్వాత వాళ్ల గురించి చెప్తాను. సినిమా బాగుండాలి మన అందరి లైఫ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మే1న మనం సినిమాని సెలెబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా మీద ఉన్న ప్రేమని మరొకసారి చూపించబోతున్నాం. సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొక్కసారి గట్టిగా దేశం మొత్తం వినిపించేలాగా చూపిద్దాం. ఒక ఒక కమర్షియల్ మాస్, థ్రిల్లర్ ఫిలిం కలిస్తే ఎలా ఉంటుందో హిట్3 లో చూస్తారు. అది చాలా రేర్ కాంబినేషన్.  ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది. ఐదు నిమిషాలు దేవుడు ముందు నిలబడ్డాను. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్ లో సినిమా చూశాను. మే ఫస్ట్ కి మీ అందరికీ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్.. మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు. నా ముందు మీరు ఉన్నారు. మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. కళ్యాణ్ గారు స్టైల్ లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. మే1న వస్తున్న సినిమాలు అన్నీ విజయం సాధించాలి. మనందరం థియేటర్స్ లో కలిసి చాలా ఎంజాయ్ చేయాలి. థాంక్యూ సో మచ్’అన్నారు

హీరో అడివి శేషు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చినట్లుగా ఉంది. నాని బ్రో గూడచారి ట్రైలర్ లాంచ్ చేశారు. అప్పుడే సినిమా చేస్తానని అన్నారు. ఆయన నన్ను ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు. నాని వలనే రెండు ఫ్రాంచైజీలున్న హీరోని అయ్యాను. హిట్ త్రీ లాస్ట్ 30 మినిట్స్ చూసాను. మామూలుగా ఉండదు. క్రేజీగా ఉంది తెలియని సర్ప్రైజ్ లో చాలా ఉన్నాయి. రాజమౌళి గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను బాహుబలి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పట్టుదల అనేది రాజమౌళి గారి నుంచే నేర్చుకున్నాను. సినిమా బాగుంటే పబ్లిక్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హిట్ 3 బూకింగ్స్  చూస్తుంటే అది అర్థమవుతుంది. సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్ కాబోతున్నాయి. మే ఫస్ట్ కోసం ఈగర్ గా  వెయిట్ చేస్తున్నాను’అన్నారు

హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్తే. హిట్ నాది, శేష్ ది, నాని అన్నది,  హిట్ మాది,  మన అందరిదీ. ఇదే స్టేజ్ మీద నాని అన్న పలక్ నామ దాస్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు నేను హీరోగా హిట్  అనౌన్స్ చేశారు. ఇదే వేదిక మీద హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. రాజమౌళి గారి సపోర్టుకి థాంక్యూ సో మచ్. హిట్ నుంచి మరెన్నో సినిమాలు వస్తాయి. నాని అన్న యాక్టర్ గా హ్యాట్రిక్ కొట్టారు నిర్మాతగా హ్యాట్రి కొట్టారు. నిర్మాతగా యాక్టర్ గా దీంతో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ కాబోతుంది. ప్రశాంతి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్. మే 1న ఈ సినిమా చాలా వైలెంట్ గా ఉండబోతుంది. ఇది చాలా న్యూ ఏజ్ ఫిలిం. హిట్టు నా మనసుకి చాలా దగ్గరైన సినిమా నా కెరీర్ గ్రోత్ లో చాలా క్రూషియల్ ఫిల్మ్. హిట్ 3 వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను .అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో డీవోపీ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంతాపం తెలిజేస్తున్నాను. నా విజన్  ని నమ్మి ఈ సినిమాలో పార్ట్ అయిన నటీనటులకు సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆర్ డైరెక్టర్ నాగేంద్ర గారు వండర్ఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. షాను గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. మిక్కి జే మేయర్ బ్రిలియంట్ బిజిఎం, మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పార్ట్ అయినా శ్రీనిధి శెట్టి థాంక్యూ. నాని గారు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా మీద ఆయనకున్న పాషన్ అద్భుతం. ఈ సినిమా షూటింగ్ లో ఫైర్ నాని గారి హెయిర్ కి అంటుకుంది. వెంటనే యూనిట్ వెళ్లి ఆపింది. ఇంకా షూటింగ్ ఉండదనుకున్నాను. ఆయన నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయారు. అదే రోజు  షూటింగ్లో ఆయన తలకి గాయం అయింది. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మిగిలిన సీన్స్ అన్ని ఫినిష్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు. సినిమా మీద ఆయనకున్న మ్యాడ్ పేషన్ వండర్ ఫుల్. నాని గారు పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. నన్ను ఇంత బలంగా నమ్మిన నాని గారికి థాంక్యూ. మే ఒకటి నా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం.  వైలెంట్ గా ఉంటుంది. సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి’అన్నారు.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నాని గారికి థాంక్యూ. డైరెక్టర్ శైలేష్ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నేను కాలేజ్ డేస్ లో నాని గారు సినిమాలన్నీ చూశాను. ఆయనతో వర్క్ చేయాలని ఉండేది. ఈ సినిమా ద్వారా అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. నాని గారు ప్రతిరోజు తనని  రీఇన్వెంట్  చేసుకుంటారు. ఆయనతో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి గారిని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కేజీఎఫ్ ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మళ్లీ ఇప్పుడు హిట్ 3 రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కూడా కేజిఎఫ్ లా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి’అన్నారు.

స్టంట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శైలేష్ గారికి థాంక్యూ. నాని గారితో ఇది నా మూడో సినిమా. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు ఈ సినిమాని ఆడియన్స్  చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు

డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఒక గెస్ట్ గా కాదు హిట్ ఫ్రాంచైజ్ ఫ్యాన్ గా ఇక్కడికి వచ్చాను. హిట్ 3 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అది అనౌన్స్మెంట్  నుంచి ఈరోజు వరకు తెలుస్తూనే ఉంది. నాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. వాల్ పోస్టర్ మనందరిదీ. లెట్స్ మేక్ వాల్ పోస్టర్ ప్రౌడ్’అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నాని గారితో సినిమా చేయలేకపోయానని వెలితి ఉండేది. ఈ సినిమా కాల్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ కథ చెప్పినప్పుడే ప్రొడక్షన్ డిజైన్ కి ఎంత స్కోప్ ఉందో అర్థమైంది. చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఇది. చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాము. ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని ఇంత ఫాస్ట్ గా చేయడానికి కారణం ప్రొడ్యూసర్స్ నాని గారి పేషన్. ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు .డిఓపి షాను గారు వర్క్ అద్భుతమైనటువంటి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు

యాక్టర్ శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ…. ఈ ఫిల్మ్ యునివర్స్ కి నేను చాలా పాత ప్లేయర్ని. డైరెక్టర్ గారికి థాంక్యూ. నిర్మాత ప్రశాంతి గారికి థాంక్యూ నాని అన్నని స్క్రీన్ మీద చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’అన్నారు

యాక్టర్ అమిత్ శర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో నేను చేసిన రోల్ గురించి ఇప్పుడే చెప్పలేను. అందరూ సినిమా చూడండి. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేసాం. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు. (Story:’హిట్ 3′ సూపర్ డూపర్ హిట్ అవుతుంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version