ఏపీ. పి.టి.డి మరియు ఎన్.ఎం.యు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
న్యూస్ తెలుగు / వినుకొండ :ఏపీ. పి.టి.డి, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు 28 మరియు 29వ తేదీలలో రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినుకొండ డిపో నందు ఎన్. ఎం.యు.ఏ సెక్రటరీ వి.ఎస్పి. నాయక్ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఎన్.ఎం.యు.ఏ సభ్యులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ నిరాహార దీక్షలో పి కృష్ణ, ఎస్.కె ఎస్ బాబు, ఎస్.కె మౌలాలి, ఎస్కే సైదా, జి నాగేశ్వరరావు, కె.ఎస్.ఎన్. రెడ్డి, డి.ఎస్. రావు, కె.ఎస్.రావు లు పాల్గొన్నారు.(Story:ఏపీ. పి.టి.డి మరియు ఎన్.ఎం.యు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం)