జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
ఉప్పు మస్తాన్రావు చిత్రపటానికి నివాళులర్పించిన జర్నలిస్టులు
న్యూస్ తెలుగు/వినుకొండ : జర్నలిస్ట్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వినుకొండ నియోజకవర్గం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ స్వర్గీయ ఉప్పు మస్తాన్రావు నాలుగో వర్ధంతి సభ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం నిర్వహించారు. వినుకొండ జర్నలిస్టులు, నాయకులు, అభిమానులు మస్తాన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి జర్నలిస్టు మస్తాన్రావు మృతి చెందడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా సమయంలో జర్నలిస్టులో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి మరణించడం జరిగిందన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలను నాటి ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి మరిచిందన్నారు. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి నేటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టులు రాజవరపు ప్రకాష్ రావు, లగడపాటి వెంకట్రావు, యార్లగడ్డ ఆజాద్, గంట కోటేశ్వరరావు, దేవి శెట్టి కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, శ్రీను, నాయకులు పివి. సురేష్ బాబు, ఆర్, శ్రీనివాసరావు, గంధం కోటేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, మల్లెల ప్రసాదు, పొట్లపాడు సాయిబాబా, అడపాల వెంకటేశ్వర్లు, కోకా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.(Story : జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి )

