పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తేవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ , పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలి
వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ కోట్లు పెట్టి బిల్డింగులు కడుతున్నారు మూలకు పెడుతున్నారు కానీ ఉపయోగం లోకి తేవడం లేదు. కానీ కాసుల కోసం మళ్ళీ బిల్డింగులు కడతామంటున్నారు ఎవరికి లాభం
అని అన్నారు. పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 ఫైనాన్స్ తో కట్టిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది దాన్ని వినియోగం లోకి తేవాలనీ ప్రజలకు కోరుతున్నారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ ను కట్టి ప్రజలకు అప్పగించండి అంటూ డిమాండ్ చేశారు. పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు ఇచ్చి వినియోగం లోకి తేవాలని ప్రజల కోరిక మేరకు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి కలెక్టర్ ని , ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ గంధం నాగరాజు, సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు. (Story:పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తేవాలి)