వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం పెద్దమందడి మండలంలోని అల్వాల్ జగత్ పల్లి చిన్న మందడి పెద్దమందడి మణిగిల్ల గ్రామాల వరి కొనుగోలు కేంద్రాలను అదరపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు సేద తీరేందుకు కొనుగోలు కేంద్రాల్లో టెంట్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లేకుంటే సెంటరును మూసివేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల పై ఉందని సూచించారు. అదేవిధంగా తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని గాఢములకు తరలించాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. లారీలు పెట్టడంలో ఆలస్యం చేయవద్దని, అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారని సూచించారు. అనంతరం వెల్టూరు, మదనపూర్ గోదాములు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. (Story :వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి)