సాలూరులో ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు
న్యూస్ తెలుగు/సాలూరు : జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో టెర్రరిస్టులు అటాక్ చేసి 28 మంది భారతీయులను చంపిన విషయం అందరికీ తెలిసినదే,ఇందులో భాగంగానే శనివారం సాలూరు పట్టణంలో సాలూరు పట్టణ పోలీసులు మరియు బాంబు డిస్పోజల్ టీం ఆధ్వర్యంలో సాలూరు పట్టణంలో ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా సి ఐ అప్పలనాయుడు మాట్లాడుతూ అనుమానితులు ఎవరైనా వాహనాల్లో గాని లాడ్జిల్లో ఉన్న ప్రయాణించిన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాల తో పాటు,ఎమ్మార్వో ఆఫీస్ , గవర్నమెంట్ ఆఫీసులు, బస్ స్టాండ్, లాడ్జిలు చెకింగ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. (Story:సాలూరులో ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు)