పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షునిగా ‘చెరుకూరి’
న్యూస్‌తెలుగు/విజయనగరం : జాతీయ ట్రస్ట్ ‘అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి’ జిల్లా అధ్యక్షులు గా ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి నాగరాజు ను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు జి.వేణుగోపాల్ తెలియజేసారు. శనివారం చిన్న మధ్య తరహాశాఖ మంత్రివర్యులు కొoడపల్లి శ్రీనివాస్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో నాగరాజు కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కొండపల్లి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 52 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసిన మహానీయుడని అన్నారు.ఆయన చేసిన త్యాగఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందనారు. వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ చెన్నయ్ లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహర దీక్ష చేసిన ఇల్లు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేసి స్మృతి భవనంగా నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా భారతరత్న పురస్కారన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆలవెల్లి శేఖర్ ను నియమించారు. ఈ సందర్బంగా చెరుకూరి మాట్లాడుతూ జిల్లా అంతటా సేవా కార్యక్రమంలు నిర్వహిస్తూ సంఘం బలోపేతం చేయుటకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిమ్స్ రాజు, ఆరిశెట్టి సందీప్, పూసర్ల మోహన్, కాపుగంటి శ్రీనివాస్, సముద్రాల నాగరాజు, పూసర్ల సాయి, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షునిగా ‘చెరుకూరి’ )