ఉగ్రవాద దాడులను ఖండించిన వినుకొండ బార్ అసోసియేషన్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్, పెహల్గాం లో జరిగిన ఉగ్రమూకల దాడి ని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ. ఈ దాడి చాలా హేయమైన చర్య అని, ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతోటి ఖండించాలని కోరారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందన్నారు. ఈ దాడులు మతాల మధ్య చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బ కొట్టే లక్ష్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, మనం అందరం అప్రమత్తంగా ఐకమత్యంగా సహనంతో ఉండాలని న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘం ప్రెసిడెంట్ ఎం. శ్రీనివాసులు, సెక్రెటరీ పి.గౌస్ మొహిద్దిన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ పి.వి. రమణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎన్ శేఖర్ బాబు, ట్రెజరర్ బి శివ శంకర్ బాబు, సీనియర్ న్యాయవాదులు సిహెచ్ వెంకీ రెడ్డి, పి.జె. లూకా, ఎన్ రామకోటేశ్వరరావు, పి. సైదారావు, సి.హెచ్.ఎల్.ఎన్. మూర్తి, టి.హనుమంతరావు, ఏ. జి. పి. ఎం.జ్ఞానేశ్వర రావు, వై.శ్రీనివాసరావు, బి. శ్రీనివాసులు, కేఎస్ఏంవి నాయుడు, ఎస్కే సిద్దయ్య, జె. తిరుపతిరావు, ఆరె సామ్రాజ్యం, రెడ్డి నాగ పద్మ, ఎం.చంద్రమోహన్, ఎం.వి.అప్పారావు, బి.రామ్మోహన్ రావు, నక్కా రమణారావు, గోపా నాయక్, ఎన్.రామాంజనేయులు, శ్రీనివాసులు, ఎం సీతారామాంజనేయులు, టి.శంకర్ రావు, డి. విజయ్, సాంబశివ నాయక్, ఆర్ బాబు తదితర జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన కుటుంబాలకు సంఘం ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు.(Story : ఉగ్రవాద దాడులను ఖండించిన వినుకొండ బార్ అసోసియేషన్ )