ఉగ్ర దాడిని ఖండిస్తూ మహిళా మండలి సభ్యులతో ర్యాలీ
న్యూస్ తెలుగు/ సాలూరు : జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూమని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ అన్నారు. గురువారం సాలూరు మెయిన్ రోడ్డు యూనియన్ బ్యాంక్ దగ్గర నుండి బోసు బొమ్మ జంక్షన్ వరకు మహిళా మండలి సభ్యులతో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గామా లో సంతోషంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులు పై ఉగ్రదాడి జరపడం దుర్మార్గమని అన్నారు. అంతేకాకుండా మతం పేరు చెప్తూ 28 మంది అమాయకుల ప్రాణాలు అతి దారుణంగా తీయడం బాధాకరంగా ఉందని తెలిపారు.భారతదేశంలో కులం మతం జాతి అనే బేధాలు లేకుండా సమానత్వంతో అందరం కలిసి ఉన్నామని అన్నారు. ఒకె తల్లికి పుట్టిన బిడ్డల్లా కలసి బ్రతుకుతూ ఉన్నారని ఇది చూసి ఓర్వలేక మతం పేరుతో పాకిస్తానీ ఉగ్రవాదులు అమాయకపు టూరిస్టుల్ని చంపటం అన్యాయమని తెలిపారు. భారతీయులుగా ఇలాంటి దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి అమానవీయ ఉగ్రవాద దాడి మన భారతీయులపై జరగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు చేపట్టి భారతీయ ప్రజలను ఉగ్రవాదుల నుండి రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా మండలి నాయకులు సుగుణ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. (Story:ఉగ్ర దాడిని ఖండిస్తూ మహిళా మండలి సభ్యులతో ర్యాలీ)

