అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాలలో భాగంగా ఈ వారం విద్యా వారోత్సవాలు చేస్తూ, వనపర్తి గవర్నమెంట్ , ప్రైవేట్ కాలేజీలలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సన్మానించారు. గవర్నమెంట్ విజ్ఞాన్, సి.వి రామన్ జూనియర్ కాలేజీలలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. స్కూళ్లకు కాలేజీలకు లక్షలు లక్షలు పెట్టి హైదరాబాదులో కార్పొరేట్ కాలేజ్ లలో డబ్బులు తగులేసుకుంటున్న తల్లిదండ్రులకు మనవి. అవే డబ్బులు మిగిల్చుకొని ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీలకు పెట్టవచ్చని ఉన్నతమైన చదువులు చదువుకుంటారని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సివి రామన్ విజ్ఞాన్ మరియు గవర్నమెంట్ కాలేజీల అధ్యాపకులు, మేనేజ్మెంట్, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, పుట్టపాక బాలు, పాషా, రాము, తదితరులు పాల్గొన్నారు. (Story:అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు సన్మానం)