2025 పది ఫలితాలలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్ విద్యార్థులు 2024-2025 పదవ తరగతి ఫలితాలలో 595 టౌన్ టాప్ మార్కులతో సత్తా చాటారు. 600 మార్కులకు గాను 595 మార్కులతో టౌన్ టాప్ గా బి. నిఖిల్ గణేష్ రెడ్డి నిలవగా, వై.కీర్తి 594,జి. జస్విని మరియు పి. గణేష్ లు 593,వి. సాయి వర్షిత మరియు జి. పల్లవి లు 592, షేక్ హప్సర్ 591,వి. భవ్యశ్రీ, ఎన్. స్నేహితశ్రీ మరియు ఎస్. యశ్వంత్ రెడ్డి లు 590 వంటి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో వినుకొండ ప్రతిభను చాటినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి టి. కృష్ణవేణి తెలిపారు. 590 కి పైగా మార్కులు మొత్తం 10 మంది విద్యార్థులు సాధించి రికార్డును నమోదు చేయడం పాఠశాలకు ఎంతో గర్వకారణం అని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం సత్కరించించారు. ఈ అభినందన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై. శేషగిరిరావు, కరస్పాండంట్ వై. లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story:2025 పది ఫలితాలలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు )