ప్రజా పోరాటాలకు వైసీపీ సిద్ధం
న్యూస్ తెలుగు/సాలూరు : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల తరపున పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో చెప్పారు. మంగళవారం తాడేపల్లి లో ఉన్న ఆయన స్వగృహంలో వైసిపి పీఏసీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయికి కూడా పార్టీ తీసుకు వెళ్లాలన్న,బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ప్రజల తరపున పోరాటాలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని అన్నారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని.ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారని,రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంఎన్నికల్లో ఇచ్చిన
హామీలు ఎక్కడా అమలు చేయడం . లేదని ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి,బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్న దొర , ఆర్కే రోజా, విడుదల రజిని పిఎసి సభ్యులు పాల్గొన్నారు . (Story:ప్రజా పోరాటాలకు వైసీపీ సిద్ధం)