ఆదివాసీ గ్రామాలకు సోలార్ మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలి :సీపీఎం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీ పరిధిలో గతంలో మంజూరైన వలస ఆదివాసి గ్రామాల సోలార్ మంచినీటి బోర్లను తక్షణమే ఏర్పాటు చేయాలని మౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ఆయా గ్రామాల ప్రజానీకంతో ధర్నా నిర్వహించడం జరిగినది.
ఏడుగురాళ్లపల్లి పంచాయతీ పరిధిలో వలస ఆదివాసి గ్రామాలకు గతంలో 8 గ్రామాలకు మంచినీటి సమస్య పరిష్కారానికి సోలార్ మోటర్ మంజూరు అయినట్లుగాను అధికారులు ప్రకటన చేసి గ్రామాల పరిశీలన కూడా జరిగిందని కానీ ఏర్పాటుకు జాప్యం జరగటం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే మంజూరు అయిన సోలార్ మంచినీటి బోర్లను ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏడుగురాళ్లపల్లి సచివాలయం వద్ద వలస ఆదివాసి ప్రజానీకంతో ఆందోళన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా అనేక సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సచివాలయం సిబ్బందికి అందించడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు, మల్లం సుబ్బమ్మ, సవలం కన్నయ్యలు మాట్లాడుతూ ప్రధానంగా వలస ఆదివాసి గ్రామాలకు మంచినీరు,విద్యుత్ రహదారులు, అనేక సమస్యలు పేర్కొనిపోయి ఉన్నాయని సచివాలయం పరిధిలో కూడా ఉపాధి హామీ పనులు కల్పించడం పని జాబు కార్డు ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతుందని వలస ఆదివాసి గ్రామ సమస్యలు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సందర్భంగా కోరారు గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడం చాలా అవసరం అన్ని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మడివి రాజేష్, సవలం దేశయ్య, కూర గంగయ్య, మడివి హిరమయ్య, రవ్వ జోగయ్య, దేవయ్య నూపా సాయి, ముచ్చిక జోగయ్య మడివి మహేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆదివాసీ గ్రామాలకు సోలార్ మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలి :సీపీఎం)