Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

0

జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

న్యూస్ తెలుగు/సాలూరు : జేఈఈ మెయిన్స్ పరీక్షలో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులను
ఉన్నత ర్యాంకులు సాధించిన వారితోపాటు వారికి సహాయ సహకారాల నుంచి అందించిన అధ్యాపకులను అభినందించి సన్మానించిన ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఆమెను కలిశారు. పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్‌డ్ లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 137వ ర్యాంక్ సాధించిన ఎస్. నంద వర్ధన్ నిహాల్, 900వ ర్యాంక్ సాధించిన ఎస్. అఖిల్, 2864వ ర్యాంక్ సాధించిన పి. జగదీశ్వర్ రావు, అలాగే JEE అడ్వాన్స్‌డ్ సెలెక్షన్ లిస్ట్‌కు ఎంపికైన ఇతర విద్యార్థులందరిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కృషి, గురుకులాల నాణ్యమైన బోధన విధానం, మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన వీరు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చగలిగారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందఅని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story: జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థుల ప్రతిభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version