Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరు ఎమ్ డి ఓ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

సాలూరు ఎమ్ డి ఓ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

0

సాలూరు ఎమ్ డి ఓ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

న్యూస్ తెలుగు/సాలూరు : పరిశుభ్రత కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కి మంచిదని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు ఎమ్ డి ఓ ఆఫీస్ ఆవరణంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె చీపురు పట్టి రోడ్లను ఉర్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో శుభ్రత పట్ల అవగాహన కల్పించడంలో కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు.పరిసరాల శుభ్రత కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, సమాజ శ్రేయస్సుకు కూడా మూలాధారంగా ఉంటుంది అని తెలిపారు.స్వచ్ఛతను జీవిత భాగంగా చేసుకునే అలవాటు ప్రతియొక్క ఇంటి నుంచి మొదలవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి పార్వతి కూర్మరాజుపేట సర్పంచ్ ఆముదాల నళిని ,కరాసవలస ఎంపిటిసి అప్పికొండ రమాదేవి, ఉద్యోగస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:సాలూరు ఎమ్ డి ఓ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version