Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఈనెల 21న చలో కలెక్టరేట్

ఈనెల 21న చలో కలెక్టరేట్

ఈనెల 21న చలో కలెక్టరేట్

న్యూస్ తెలుగు/సాలూరు : ఈనెల 21వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండలంలో కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో అటవీ, బంజర భూములు సర్వే చేసిన వారందరికీ పట్టాలు పంపిణీ చేయాలి సర్వే చేసిన వారికి పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు.ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు పంపిణీ చేయకపోవడం వలన గిరిజనులు పేదలు నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లేడు వలస బోర్రపనుకువలస పట్టాలు ఇవ్వాలని పోరాటం చేసిన సందర్భంలో కలెక్టర్ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీని అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో అనేకమంది గిరిజన రైతులు పేద రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి వారందరికీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సారిక, జిల్లేడు వలస, డొంకల వెలగవలస, కొటియా సరిహద్దు గ్రామాల అన్ సర్వేడు భూములను సర్వేలు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. దశాబ్దాలు కాలంగా అన్సర్వేడు భూములు సరిగా సర్వేలు చేయకపోవడం వలన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అన్సర్వేడు భూములన్నీ సర్వేలు చేసి గిరిజన రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సీనియర్ నాయకులు సుకురు గంగయ్య మండల కమిటీ సభ్యులు చింత జోగయ్య, గేమ్మెల తిరుపతి బాడమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు చింతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story:ఈనెల 21న చలో కలెక్టరేట్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!