నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
న్యూస్‌తెలుగు/ వినుకొండ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలో మోడల్ స్కూల్ సంఘంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శుక్రవారం చీఫ్ విప్ జీవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ లక్ష్యం దిశగా పయనిస్తుందన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారని విమర్శించారు. 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో మోడల్ స్కూల్స్, వసతి గృహాల నిర్మాణానికి నిధులు తీసుకురావడం జరిగిందని, స్థలం సేకరణలో జాప్యం జరగడం వలన నిర్మాణ పనులు పూర్తి కాలేదని, తర్వాత వచ్చిన వైసిపి ఐదేళ్ల పాలనలో పనులు ఒక్కడు కూడా ముందుకు వేయలేదన్నారు. మోడల్ స్కూల్ బాలికల వసతి గృహానికి 2.26 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిందని, అలాగే కేజీబీవీ విద్యాలయ భవన నిర్మాణానికి 1.40 కోట్లు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు 45 లక్షలు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. 11 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థులకు వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మండల అధికారులు మరియు తిరుమల శెట్టి బాలయ్య, అయినాలా కోటేశ్వరరావు, గడిబుడి వేణు, జాగర్లమూడి నాగేశ్వరరావు అబ్బూరి బ్రహ్మనాయుడు, తదితర నాయకులు పాల్గొన్నారు. (Story:నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం..)

