అంగన్వాడీ టీచర్లకు వర్క్ ఆర్డర్స్ పంపిణీ
న్యూస్ తెలుగు/సాలూరు : అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యవంతమైన జీవనశైలి మరియు శరీర దృఢత్వమును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు వర్క్ ఆర్డర్స్ పంపిణీ చేసి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు వర్కౌట్ మెటీరియల్‌ను అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలి మరియు శారీరక దృఢతను ప్రోత్సహించేందుకు ఈ చర్య చేపట్టబడిందని తెలిపారు.ఆంగన్‌వాడీ టీచర్లు గ్రామీణ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలందించగలరు అన్నారు అందుకే ఈ వర్కౌట్ పరికరాలు వారికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ టీచర్లను తమ విధులను జాగ్రత్తగా, నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలి” అని సూచించారు.
కార్యక్రమంలో ఐ సి డి ఎస్ పి ఓ విజయలక్ష్మి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. (Story: అంగన్‌వాడీ టీచర్లకు వర్క్ ఆర్డర్స్ పంపిణీ )