సాలూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్‌కు ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం ప్రారంభించారు. అమ్మవారి పండుగను పురస్కరించుకుని సాలూరు సీనియర్ క్రికెటర్స్ (ఎస్ ఎస్ జి) ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేసి స్వయంగా క్రికెట్ బ్యాట్‌ను చేతబట్టి తొలి బాల్‌ను ఆడడం ద్వారా టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీలో పాల్గొంటున్న విజయం మరియు మంచి భవిష్యత్తు కోరుకుంటూ, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూనిశెట్టి భీమారావు,వైకుంటపు హర్షవర్ధన్, జనసేన నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. (Stroy : సాలూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం)