పేదల గూడు కోసం వేలాదిమంది సిపిఐ చే భూ పరిరక్షణ పోరాటం
ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేయకండి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి
ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
నగరంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి లేకపోతే మేమే పాకలు వేస్తాం
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపు
న్యూస్ తెలుగు/చింతూరు : రాజమహేంద్రవరం నగరంలో పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూకబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఈ స్థలాలన్నీ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి సుమారు నాలుగు వేల మంది అర్జిదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల గమేళా ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు.
దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని ఐదు లక్షల సబ్సిడీ మంజూరు చేయాలని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం అక్కడ ఎర్రజెండా పాతి కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతిన పూనారు.అంతకు ముందు జరిగిన బహిరంగ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించగా కే రామకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని ఇప్పటివరకు మంగళగిరి మినహా ఎక్కడ ఈ హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే 8 మాసాలుగా ఆందోళనలు చేస్తున్నామని ఆయన తెలిపారు.రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉందని ఇక్కడ నడిబొడ్లు 26 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే నేపథ్యంలో ప్రభుత్వ భూములు పేదల ఇళ్ల స్థలాల కోసం పంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉంటేనే వారి ముఖంలో ఆనందం ఉంటుందని ఇంటి స్థలం అనేది ప్రతి పేదవాడి కల అని ఆయన తెలిపారు. ఇంటి స్థలంలో నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి వస్తుందని ఆయన విమర్శించారు. పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదని కే రామకృష్ణ పిలుపునిచ్చారు .సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ స్వంత ఇల్లు లేకపోతే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని అద్దె కట్టుకోలేక మానసికంగా ఆవేదన చెందుతారని వనజ అన్నారు. ఆవకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల స్థలంలోనే ఇల్లు ఇవ్వాలని ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇల్లు ఇస్తే ప్రజలు అక్కడికి వెళ్లలేక ఇక్కడే అద్దె కట్టుకుని జీవించే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజమండ్రి సిటీ రూరల్ ప్రజా ప్రతినిధులు తక్షణమే ఇళ్ల స్థలాలపై కార్యాచరణ ప్రకటించాలని మేము రాస్తున్న ప్రతి దరఖాస్తుదారులకు ఇక్కడే ఇళ్ల స్థలం మంజూరు చేయాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి త్వరలో ఇక్కడే పాకలు వేస్తామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి
కే సత్తిబాబు ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు , సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు సిపిఐ నగర నాయకులు ఎస్ నవరోజి ,టీ నాగేశ్వరరావు ,నల్ల రామారావు జట్ల సంఘం అధికారి బాడీ పి దేవుడు బాబు కాళ్ల అప్పలనాయుడు , దుర్గా ప్రసాద్ బాలకృష్ణ వెంకట్రావు ప్రజాసంఘాల నాయకులు ఎస్ రమణ అల్లం వెంకటేశ్వరరావు దుర్గమ్మ హరినాథ్ వేణు గోపాల్ తదితరులు నాయకత్వం వహించారు.(Story : పేదల గూడు కోసం వేలాదిమంది సిపిఐ చే భూ పరిరక్షణ పోరాటం )