గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని కార్యాలయంలో గురువారం కేజీబీవీ, మోడల్స్ స్కూల్, మరియు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీ ల ప్రిన్సిపాల్ లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000కి 970 మార్కులు సాధించిన చీకటి గల పాలెం మోడల్ స్కూల్ విద్యార్థి పమ్మి కీర్తనను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అభినందించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, మంత్రి లోకేష్ ఆశయాల ప్రకారం ప్రాథమిక విద్య నుండి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని చీఫ్ విప్ జీవి అన్నారు.(Story :గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచండి)