చింతూరుకు వన్నెతెచ్చిన ఒకేషనల్ ఇంటర్ విద్యార్థి ప్రత్యూష
బిఎఫ్ఎస్సి గ్రూప్ లో 964 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
స్టేట్ మొదటి ర్యాంక్ కైవసంతో సన్మానించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
ఆమె ఎవరో కాదు చట్టి గ్రామానికి చెందిన పింగళి ప్రత్యూష
న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన పింగళి. అంజిరెడ్డి – కృష్ణవేణి దంపతుల బిడ్డ పింగళి ప్రత్యూష పదవతరగతి చింతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి పేదరికంతో కొన్నాళ్ళు తన చదువును అపి తిరిగి ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఇంటర్ లో ఫిషరీస్ సైన్స్ గ్రూప్ లో ఉచిత ప్రవేశం పొంది ఆర్ధిక స్తోమత సరిగా లేక బాలికల వసతి గృహంలో ఉండి చదువుతూ 964 మార్కులతో మన రాష్ట్రం లోనే మొదటి ర్యాంక్ సాధించింది. ఈ విషయం తెలిసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పింగళి ప్రత్యూషను మంగళవారం అమరావతిలో శాలువతో సత్కరించి ల్యాప్టాప్ ను బహుకరించారు. ప్రశంసలు అందుకున్న మన చట్టి కి చెందిన పింగలి ప్రత్యూష. ఒకేషనల్ సీనియర్ ఇంటర్లో ప్రత్యూష కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో చింతూరు చట్టి షోషల్ మీడియా గ్రూప్లలో తనను అభినందించారు. పలువురు. పేదరికంలో ఉన్న ప్రత్యూష మరింత ఉన్నత చదువులలో రాణించాలంటే ప్రభుత్వం ప్రోత్సాహించాలని, దాతలు కూడా సహకరించి ప్రతిభ ఉన్న తనను ప్రోత్సాహించాలని కోరుకుంటున్నారు.(Story : చింతూరుకు వన్నెతెచ్చిన ఒకేషనల్ ఇంటర్ విద్యార్థి ప్రత్యూష )