Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైభవంగా ప్రారంభమైన మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు

వైభవంగా ప్రారంభమైన మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు

0

వైభవంగా ప్రారంభమైన మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు

శ్రీ వీరాంజనేయస్వామికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు లీలావతి దంపతుల పూజలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గంలోని మదమంచిపాడులో శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లు గురువారం వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా, వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు ఏటా భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిం చారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయన్నారు. తిరునాళ్లలో పాల్గొన్న ఆర్యవైశ్య ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులందరికీ అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఆర్యవైశ్య సత్రంలో ఏటా వేలాదిమంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. అన్నదానం, దేవాలయ నిర్మాణాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండడం వారి సేవాభావానికి నిదర్శనం అన్నారు. వీరాంజనేయ స్వామివారి తిరునాళ్లకు వచ్చ్ భక్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సమృద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు, స్థానిక నాయకులు, అధికారులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు.(Story : వైభవంగా ప్రారంభమైన మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version