రెడ్ బుక్ పాలనలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న శక్తులు
శాంతి భద్రతలను గాలికొదిలేసి చోద్యం చూస్తున్న పోలీసులు
ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో కూటమి నేతలు, వైసీపీ సానుభూతిపరుల పై విచక్షణారహితంగా దాడిచేసిన కూటమి నాయకులు. ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరులైన లచ్చిశేట్టి బుచ్చమ్మ, రాగాలా భువనేశ్వరి, గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వినుకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. అనంతరం బొల్లా మీడియాతో మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ కేవలం వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష్య సాధించడానికి ఉపయోగిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.(Story : రెడ్ బుక్ పాలనలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న శక్తులు )