వినుకొండలో అగ్నిమాపక వారోత్సవాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా నాల్గవ రోజు వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్రాదికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణం నరసరావు పేట రోడ్డులో గల నిర్మల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు బాలబాలికలకు ,ఉపాధ్యాయులకు మరియు స్కూల్ సిబ్బందికి వేసవి కాలం లో పాటశాల యొక్క తరగతి గదులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా వాటినుండి బయటపడాలి అనేది రెస్క్యూ మెదడ్స్, సిపిర్ చేసే పద్ధతి డెమో ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, సిబ్బంది ఉత్సాహంగ పాల్గొన్నారు. గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు మరియు ఎలక్ట్రికల్ షార్ట్ సర్కూట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు మరియు అగ్ని ప్రమాదాలు జరిగిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మాన్ కే. శ్రీనివాసరావు, డ్రైవర్ మరియు ఆపరేటర్స్ ఎస్వి. రమణారెడ్డి, కె. రవికుమార్, ఫైర్ మాన్స్ ఎస్ .కేశవ బాబు, జి. ప్రభాకర్ రెడ్డి, ఎం. కోటేశ్వరరావు, ఎస్.కె .మస్తాన్, ఎం. మల్లికార్జునరావు, హోంగార్డ్స్ జి .రామకృష్ణారావు, పి. భాష ఖాన్, డి.మస్తాన్ వలి ,ఎ. శ్రీను పాల్గొన్నారు.(Story : వినుకొండలో అగ్నిమాపక వారోత్సవాలు )