ప్రజా ప్రతినిదుల పేర్లు చెప్పి వీరంగం చేస్తున్న అధికారులు
న్యూస్తెలుగు/వనపర్తి :ప్రజా ప్రతినిదుల పేర్లు చెప్పి వీరంగం చేస్తున్న అధికారులు. చిరు వ్యాపారులతో అందిన కాడికి దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు కోరారు. వనపర్తి లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ మానిటరింగ్ కమిటీ పని చేయకపోవడంతో ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేస్తూ కొత్తగా డబ్బాలు వేసి రోడ్లన్నీ ఆక్రమించి పాదాచారులకు, వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, అలాగే పలు దుకాణాల ముందు డబ్బులు వసూలు చేసుకుంటూ చిన్న చిన్న డబ్బాలు వేస్తున్నారని, అలాంటి దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, కాలనీలలో రోడ్డును మొత్తాన్ని ఆక్రమిస్తూ కట్టడాలు కట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలలో కింది అధికారులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలలో పలు అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై విచారణ చేయాలని పలుసార్లు కలెక్టర్కు విన్నవించుకున్నామని దానిలో భాగంగానే కమీషనర్ కు పలు సాక్షాలతో విడివిడిగా నాలుగు వినతిపత్రాలు ఇచ్చామని త్వరలో పై అధికారులకు అన్ని సాక్షాదారాలతో ఫైల్ అందజేస్తామని ఇందుకు కారణం అయిన ఉద్యోగులను తొలగించాలని సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు గౌనికాడి యాదయ్య ,వెంకటేశ్వర్లు, గంధం భరత్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు,పుట్టపాక బాలు, పాషా తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజా ప్రతినిదుల పేర్లు చెప్పి వీరంగం చేస్తున్న అధికారులు)