పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బిజెపి మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి: అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అన్నారు. అకాల వర్షాల కారణంగా మండలంలోని పంతుల్ తండా గ్రామంలో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు, గొల్లపల్లి వీరాచారి, ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, గిరిజన మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు మోహన్ నాయక్, మండల అధ్యక్షుడు రైనా నాయక్, స్వరూప, ప్రసాద్, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. (Story: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి)