వినుకొండ లో అగ్నిమాపక వారోత్సవాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా వినుకొండ అగ్నిమాపక కేంద్రమునకు పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎస్. శ్రీధర్ విచ్చేసి బ్రోచర్ అండ్ పాంప్లెట్స్ ఆవిష్కరించారు. అగ్నిమాపక అమరవీరులకు గౌరవ వందనం చేశారు. ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ. మన పల్నాడు జిల్లాలోని వినుకొండ అగ్నిమాపక కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందని, అందులో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలను వినుకొండ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మాన్ కే. శ్రీనివాసరావు, డ్రైవర్ మరియు ఆపరేటర్స్ ఎస్వి. రమణారెడ్డి, కె. రవికుమార్, ఫైర్ మాన్స్ ఎస్ .కేశవ బాబు, జి. ప్రభాకర్ రెడ్డి, ఎం. కోటేశ్వరరావు, ఎస్.కె .మస్తాన్, ఎం. మల్లికార్జునరావు, హోంగార్డ్స్ జి .రామకృష్ణారావు, పి. భాష ఖాన్, ఎం. శ్రీను, ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు చుట్టుపక్కల ప్రజలు వారోత్సవాలలో పాల్గొన్నారు. (Story : వినుకొండ లో అగ్నిమాపక వారోత్సవాలు)