Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా చరిత్ర విభాగo అధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం, ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ , విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లో రత్నగిరి జిల్లా లోని మౌ అనే గ్రామంలో 1891 ఏప్రియల్ 14 వ తేదీన రామ్ జీ మాలో జీ వక్పాల్ భీమా భాయ్ పుణ్య దంపతులకు జన్మించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత దేశానికి మొదటి న్యాయ శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ రచనా కమిటి అధ్యక్షుడుగా పని చేశారని, సామాజిక సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సాధించడానికి జ్యోతీ రావ్ ఫూలే మహనీయుడుని ఆదర్శంగా భావించి సమ సమాజం కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ మాట్లాడుతూ జ్యోతి రావ్ ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహా నియులు కృషి ఫలితంగా ప్రస్తుత సమాజంలో కుల, మత, జాతి వివక్షత లేకుండా ప్రజలందరు కలిసి మెలిసి సహా జీవనం సాగిస్తున్నారన్నారు. రాజనీతి శాస్త్ర విభాగధిపతి యస్. అప్పన్నమ్మ మాట్లాడుతూ భారత దేశానికి రాజ్యాంగము తయారు చేసిన ఘనత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దక్కుతుందని వారి కృషి ఫలితం గానే చక్కని పరిపాలన జరుగుతుందని తెలిపారు.చరిత్ర విభాగాధిపతి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ దళిత బహుజన ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప చారిత్రాత్మకమైన మహనీయుడని తెలిపారు.కంప్యూటర్ విభాగాధిపతి యన్.రమేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత దేశంలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మానవతా వాది అని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వై.పద్మ, జి.వెంకటరావు,కె.శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి,కె.శకుంతల, కె.శైలజ,జి.హరతి,నాగ రామ్మోహన్ రావు.యస్.రాజబాబు, జి.సాయికుమార్, తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!