కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
న్యూస్‌తెలుగు/చింతూరు : భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సామాజిక సంస్కర్త, న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 135వ జయంతి జరిపారు. డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఏప్రిల్ 14ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది అని తెలిపారు, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్, డాక్టర్ అంబేద్కర్ సందేశం, సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి వివిధ కార్యక్రమాలు, కార్యక్రమాలతో ఈ సందర్భంగా జరుపుకున్నామని హాస్పిటల్ పర్యవేక్షణధికారి డా. కోటిరెడ్డి తెలిపారు, అలానే హాస్పిటల్ ఆవరణలో అంబేద్కర్ ఫోటోకి సూపరింటెండెంట్ , డాక్టర్స్, సిబ్బంది సహా పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ – అణగారిన వర్గాల కోసం పోరాడి, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దార్శనిక నాయకుడి జన్మదినోత్సవాన్ని స్మరించుకోవడానికి డాక్టర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు.అని సూపరింటెండెంట్ తెలిపారు
– ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆయన వారసత్వం దేశ పురోగతికి మార్గదర్శక శక్తిగా పనిచేస్తుంది చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్, ఎం వి కోటిరెడ్డి , డాక్టర్స్, శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ, ఎస్ ఎన్ సి యూ సిబ్బంది,డయాలసిస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు)